Advertisementt

తండ్రి కొడుకులు గడ్డం పెంచారు!

Sun 19th Jun 2016 02:57 PM
nagarjuna family heroes,beard faces,nagarjuna,naga chaitanya,akhil,sahasam swasaga sagipo audio  తండ్రి కొడుకులు గడ్డం పెంచారు!
తండ్రి కొడుకులు గడ్డం పెంచారు!
Advertisement
Ads by CJ

తండ్రిలాగే కొడుకులు కూడా గడ్డం పెంచి కనిపించడం కాస్త సరదాగా కనిపిస్తుంది. చూసేవారికి ముగ్గురిదీ ఒకే స్టైల్‌ అనుకుంటారు. విషయం ఏమంటే అక్కినేని నాగార్జున తన కొత్త పాత్రకోసం గడ్డం పెంచుతున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'హతీరామ్‌బాబా' పాత్రలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. పాత్ర పోషణ కోసం కొద్దిరోజులుగా గడ్డం పెంచుతున్నారు. ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్‌ కూడా ఇటీవల గడ్డంతో కనిపిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం పాటల వేడుకలో వీరు ముగ్గురు గడ్డంతో కనువిందు చేశారు. నాగార్జున పాత్ర కోసమైతే నాగచైతన్య తన తాజా చిత్రం 'ప్రేమమ్‌' కోసం ఇలా కనిపిస్తున్నారని అనుకోవచ్చు. మరి అఖిల్‌? తండ్రి, అన్నయ్య పెంచారు కాబట్టి ఆయన కూడా అదేరూట్‌లో ఉన్నారా? ఎందుకంటే అఖిల్‌ కొత్త సినిమా గురించి ఇంకా తేలలేదు. అయితే అఖిల్‌ మోడల్‌గా పలు ప్రొడక్ట్‌లకు ఫోటో సెషన్స్‌ చేస్తున్నారు. దానికోసం స్టైల్‌ మార్చారని అనుకోవచ్చు.

'సోగ్గాడే చిన్ని నాయన' ప్రమోషన్ సందర్భంగా కూడా తండ్రి, కొడుకులు పంచె, దోవతి ధరించి ఫోటోలు దిగారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ