Advertisementt

చరణ్ కోసం కాజల్!

Sat 18th Jun 2016 06:11 PM
ram charan,kajal agarwal,druva movie,item song  చరణ్ కోసం కాజల్!
చరణ్ కోసం కాజల్!
Advertisement
Ads by CJ

'మగధీర' సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ లు 'గోవిందుడు అందరివాడెలే' సినిమాతో మరిసారి జత కట్టారు. ఆ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. వీరద్దరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే కాజల్ మరోసారి చరణ్ కోసం రెడీ అవుతోందట. హీరోయిన్ గా మాత్రం కాదు. చరణ్ ప్రస్తుతం 'ధ్రువ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మొదట అనసూయను అనుకున్నారు. కాని ఆ పాటలో టాప్ హీరోయిన్ అయితే బావుంటుందని భావించిన చిత్రబృందం కాజల్ ను సంప్రదించారట. కాజల్ సైతం ఈ పాటలో నటించడానికి ఒప్పుకుంది. అవకాశాలు లేక ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిందో.. లేక చరణ్ తో తనకున్న స్నేహంతో ఒప్పుకుందో కానీ ఐటెం సాంగ్ కు అంగీకరించి అందికీ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా కాజల్ నటించిన రెండు పెద్ద సినిమాలు ఘోర పరాజయం పొందాయి. ఈ నేపధ్యంలో వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ