Advertisementt

పవన్‌ తో డైరెక్ట్ గా పోటీకి ఛాన్స్ కొట్టేశాడు!

Fri 17th Jun 2016 07:45 PM
pawan kalyan,ajay,kushi movie,gabbar singh,ajay villain in pawan kalyan movie,sj surya  పవన్‌ తో  డైరెక్ట్ గా పోటీకి ఛాన్స్ కొట్టేశాడు!
పవన్‌ తో డైరెక్ట్ గా పోటీకి ఛాన్స్ కొట్టేశాడు!
Advertisement
Ads by CJ

కీలకమైన ఆర్టిస్ట్‌గా, యంగ్‌ విలన్‌, హీరోగా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్‌. ముఖ్యంగా అజయ్‌కు రాజమౌళి చిత్రాలు మంచి లైఫ్‌ని ఇచ్చాయి. అలాగే ఇటీవల వచ్చిన సూర్య-విక్రమ్‌ కె.కుమార్‌ల దర్శకత్వంలో వచ్చిన '24' చిత్రంలో విలన్‌ ఆత్రేయ సహచరుడిగా మంచి పాత్రను పోషించాడు అజయ్‌. తాజాగా విడుదలైన త్రివిక్రమ్‌-నితిన్‌ల 'అ..ఆ' చిత్రంలో కూడా ఆకట్టుకున్నాడు. అజయ్‌కు విక్రమ్‌ కె.కుమార్‌, సూర్య, రాజమౌళి, రవితేజ వంటి వారి నుండి అద్భుతమైన నటుడు అనే ప్రశంసలు లభించాయి. అయితే అజయ్‌కు నటునిగా మంచి గుర్తింపును తెచ్చిన చిత్రం మాత్రం 'ఖుషీ'. ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌,భూమిక జంటగా నటించిన ఈ చిత్రంలో తనదైన హైదరాబాద్‌ స్లాంగ్‌లో ఆయన భూమికను టీజ్‌ చేసిన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన పవన్‌ ప్రోత్సాహంతో 'గబ్బర్‌సింగ్‌' చిత్రంలో పవన్‌కు సోదరుడిగా కీలకమైన పాత్రను పోషించి మంచి మెప్పు పొందాడు. ప్రస్తుతం పవన్‌ హీరోగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే చిత్రంలో అజయ్‌.. పవన్‌కు ధీటైన యువ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ చిత్రం కూడా హిట్టయితే అజయ్‌ రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ