టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల వరకు కొంత వెనుకబడ్డ విషయం వాస్తవమే. ఆయన కెరీర్‌లో నిన్నటివరకు ఒక్క 50కోట్ల సినిమా కూడా లేదు. కానీ 'నాన్నకుప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ 50కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయినా కూడా ఈ చిత్రం భారీ బడ్జెట్ కారణంగా కేవలం యావరేజ్‌గానే నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్' చిత్రం చేస్తున్నాడు. విడుదలకు రెండు నెలల ముందుగానే ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్‌లో సంచలనాలను సృష్టిస్తోంది. కేరళ, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే భారీ మొత్తాలకు బయ్యర్లు సినిమా రైట్స్‌ను తీసుకున్నారు. నైజాంను దిల్‌రాజు ఫ్యాన్సీ రేటుకు రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ చిత్రం మిగిలిన ఏరియాల్లో కూడా భారీ బిజినెస్ చేస్తోంది. రెస్టాఫ్ ఇండియా తప్ప మిగిలిన ఏరియల్లో ఈ చిత్రం ఇప్పటికే 61కోట్ల బిజినెస్ కంప్లీట్ చేసింది. ఈ చిత్రం హిట్టయి అందరికీ లాభాలు రావాలంటే కనీసం 80 నుండి 90కోట్లు వసూలు చేయాల్సివుంటుంది. అయితే ఈచిత్రం టీజర్‌ను ఈనెల మూడో వారంలో గానీ, లేదా నాలుగోవారంలో గానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.