ప్రస్తుతానికి మంత్రిగా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా ఆయనను కేవలం శాసనమండలికి పంపాలనేది బాబు వ్యూహం. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం లోకేష్ ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నాడు. ఇందుకోసం చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంను వదులుకొని లోకేష్‌కు స్ధానం కల్పిస్తాడని ప్రచారం జరుగుతోంది. కుప్పం కాకుంటే చంద్రగిరి నియోజకవర్గం నుండి చినబాబు పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి.ఈ రెండు సెఫ్టీ నియోజకవర్గాల నుండే లోకేష్, బాబులు నిలబడతారని సమాచారం. మొన్నటి 2014 ఎన్నికల్లో బాలయ్య చంద్రబాబును తనకు సేఫ్ అనిపించిన కుప్పం నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినా అందుకు బాబు అంగీకరించకపోవడంతో బాలయ్య హిందూపురంను ఎంచుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తన కుమారుడి కోసం బాబు కుప్పంను త్యాగం చేయడం చర్చనీయాంశంగా మారింది.