Advertisementt

ఇట్లయితే మహేష్ సినిమా సెట్టెక్కుతుందా!

Fri 17th Jun 2016 10:39 AM
mahesh babu,murugadoss,remunerations,budget  ఇట్లయితే మహేష్ సినిమా సెట్టెక్కుతుందా!
ఇట్లయితే మహేష్ సినిమా సెట్టెక్కుతుందా!
Advertisement
Ads by CJ

జులైలో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, ఎ.ఆర్‌.మురుగదాస్ ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఠాగూర్‌మధు-ఎన్వీప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్‌ తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా 23కోట్లు అని సమాచారం. ఇక తమిళ, తెలుగులోనే కాదు.. తన స్టైల్‌ ఆఫ్‌ టేకింగ్‌తో ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న మురుగదాస్‌ ఈ చిత్రానికి 20కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ క్వీన్‌ పరిణితి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందుకు గాను ఆమె మూడు కోట్లు పారితోషికంగా తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్‌..జె.సూర్యతో పాటు పలువురు తమిళ, తెలుగు, బాలీవుడ్‌ నటీనటులు నటిస్తున్నారు. హరీష్‌జైరాజ్‌, సంతోష్‌శివన్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ముందు అనుకున్న బడ్జెట్‌ 85 నుండి 90 కోట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే బడ్జెట్‌ మొత్తం రెమ్యూనరేషన్స్‌కే సరిపోతుంది అనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి సినిమా ప్రారంభానికి ముందే ఈ చిత్రం బడ్జెట్‌ను రెట్టింపు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఇట్లయితే మహేష్ సినిమా సెట్టేక్కుతుందా! అనే అనుమానాలు కూడా వినబడుతున్నాయి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ