'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని ఇచ్చిన రైటర్ టర్న్‌డ్ డైరెక్టర్ కొరటాల శివ ప్రభాస్, మహేష్‌బాబులకు ఇండస్ట్రీ రికార్డులను అందించాడు. ప్రస్తుతం కొరటాల.. ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్‌లతో మైత్రి మూవీస్ పతాకంపై 'జనతాగ్యారేజ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 12న విడుదలకు సిద్దమవుతోంది. జూన్ 15 కొరటాల శివ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వం వహించబోయే తదుపరి రెండు చిత్రాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. 'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత కొరటాల శివ.. డి.వి.వి. దానయ్య నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడు. మరో చిత్రాన్ని సినిమా పంపిణీ రంగంలో విశేష అనుభవం ఉన్న మిక్కిలినేని సుధాకర్ తన యువసుధా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. అయితే ఈ రెండు చిత్రాలలో ఎవరెవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంలో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అఫీషియల్‌గా మాత్రం హీరోలు కన్‌ఫర్మ్ కాలేదు. కాగా కొరటాల శివ 'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత మొదట దానయ్య చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లతాడు. ఆ తర్వాత తన ఐదవ చిత్రంగా మిక్కిలినేని సుధాకర్ చిత్రాన్ని టేకప్ చేస్తాడు. మొత్తానికి కొరటాల ఇప్పటి విజయపరంపరనే తన తదుపరి చిత్రాల విషయంలో కూడా కొనసాగిస్తాడని ఆశిద్దాం.