ఎన్టీఆర్ బతికివున్న హయాంలో చంద్రబాబు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు మాత్రం తన కుమారుడు, చినబాబు కోసం చక్రం తిప్పుతున్నారు. టిడిపి స్దాపించిన తొలినాళ్లలో తాము కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డామని చెప్పి బాబు ఎన్నోసార్లు వారసత్వ రాజకీయాలను దుమ్మెత్తిపోశారు. తాము కూడా వారసత్వ రాజకీయాలు చేస్తే ఇక తమకు కాంగ్రెస్‌కు మధ్య తేడా ఏమిటని? ఆయన తన మామ ఎన్టీఆర్ బతికున్నరోజుల్లో బాహాటంగానే వ్యాఖ్యానించారు. 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు దివంగత ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడిగా చేసిన ప్రకటనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. 30ఏళ్లు గడిచిపోయిన తర్వాత ప్రస్తుతం తన వారసుడు నారా లోకేష్‌ను జాతీయ ప్రదాన కార్యదర్శిగా చేశాడు. త్వరలో మంత్రి పదవిని కట్టబెట్టనున్నట్లు స్పష్టమైన సమాచారం. భావి ముఖ్యమంత్రిగా ఆయన తన కుమారుడు లోకేష్‌ను ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా లోకేష్ చెప్పనిదే సీనియర్లకు కూడా పనులు కాని పరిస్థితి నెలకొని ఉంది. అయితే చంద్రబాబుకు లోకేష్‌ను తన వారసుడిగా ప్రకటించాలనే ఆలోచన ఇప్పటిది కాదని స్పష్టం తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టినప్పుడు, ముందుచూపుతో బాలయ్య నుండి వ్యతిరేకత రాకుండా ఆయన కుమార్తె బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకున్నాడు. బాలయ్యకు లోకేష్‌ను అల్లుడిని చేసేముందు నుంచే చంద్రబాబు మదిలో ఈ ప్లాన్ ఉన్నది అన్నది స్పష్టం. ఇప్పుడు లోకేష్ బాలయ్య అల్లుడే కాబట్టి ఆయన వారసత్వాన్ని బాలయ్య కూడా కాదనలేని పరిస్థితిని చంద్రబాబు తీసుకొని వచ్చాడు. బాబా.. మజాకా...!