సూపర్‌స్టార్ మహేష్ తాను నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' చిత్రం బాగా నిరాశపరచడంతో గత కొద్దిరోజులుగా తన ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో కలిసి లండన్‌లోని పలు అందమైన లొకేషన్లలో మహేష్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ దాదాపుగా మూడు వారాలు ప్లాన్ చేశాడు. కాగా ప్రస్తుతానికి లండన్ ట్రిప్‌కు బై చెప్పిన మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు పయనమయ్యాడు. ఆయన 16వ తేదీ సాయంత్రం కల్లా హైదరాబాద్ చేరుకుంటాడని తెలుస్తోంది. ఆయన ఇండియాకు రాగానే మురుగదాస్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రంపై దృష్టి సారించనున్నాడు. 'బ్రహ్మోత్సవం' నిరాశ పరిచిన నేపథ్యంలో ఆయన మురుగదాస్ చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా బ్లాక్‌బస్టర్ మూవీగా రూపొందించేందుకు తగిన కసరత్తులు చేయనున్నాడు. ఈ విషయంలో ఆయనకు ఆయన శ్రీమతి నమ్రతా కూడా చేదోడు వాదోడుగా ఉండనుంది.