సందీప్ కిషన్ 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా గత వారమే రిలీజ్ అయ్యింది. ఆ సినిమా విడుదల అయిన తరవాత అస్సలు గ్యాప్ తీసుకోకుండా సందీప్ కిషన్ కృష్ణ వంశీ తో తీయబోయే 'నక్షత్రం' సినిమాకు సంభందించిన పనుల్లో బిజీ అయిపోయాడు. కృష్ణ వంశీ - సందీప్ కిషన్ కాంబినేషన్ లో వస్తున్న 'నక్షత్రం' సినిమా ఈ మంగళవారమే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని మణికొండలో జరుగుతుంది. మొదటి రోజే యాక్షన్ సీన్స్ తో ప్రారంభించారు. అయితే ఈ యాక్షన్ సీన్స్ చేస్తుండగా సందీప్ కిషన్ తలకి బలమైన గాయమైందని సమాచారం. అయితే వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు సందీప్ కిషన్ ని దగ్గర లో వున్న హాస్పిటల్ లో చేర్పించారని... ప్రాణానికి ప్రమాదం లేదని... కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని సమాచారం.