Advertisementt

బాలయ్య 100లో శ్రియ కు బరువైన పాత్ర!

Wed 15th Jun 2016 12:58 PM
balakrishna,gautamiputra satakarni,balakrishna 100th film,shriya,vasistha devi  బాలయ్య 100లో శ్రియ కు బరువైన పాత్ర!
బాలయ్య 100లో శ్రియ కు బరువైన పాత్ర!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలయ్యకు జోడీగా హీరోయిన్‌ శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'గోపాల గోపాల', హిందీ 'దృశ్యం' చిత్రాల్లో పిల్లలకు తల్లిగా కనిపించిన హాట్‌ హీరోయిన్‌ శ్రియ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రంలో కూడా ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తోంది. ఈ సినిమాలో శ్రియ శాతకర్ణి భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. దర్శకుడు క్రిష్‌ శాతకర్ణి భార్య వశిష్టా దేవి పాత్రను అద్భుతంగా, శ్రియ కెరీర్‌లో గుర్తుండిపోయేలా మలిచాడని సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం మూడో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌లో శ్రియ జాయిన్‌ కానుంది. మొత్తానికి బాలయ్య వందో చిత్రం వంటి మైలురాయి చిత్రంలో అవకాశం దక్కించుకున్న శ్రియకు ఈ చిత్రం తర్వాత మిడిల్‌ ఏజ్‌డ్‌ క్యారెక్టర్స్‌ బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ