Advertisementt

సమంతా పెళ్లి పెద్ద ఈయనేనా?

Tue 14th Jun 2016 07:31 PM
samanta,naga chaitanya,trivikram srinivas  సమంతా పెళ్లి పెద్ద ఈయనేనా?
సమంతా పెళ్లి పెద్ద ఈయనేనా?
Advertisement
Ads by CJ

అసలు వరస పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నింటిలోనూ సమంతానే హీరోయినుగా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? కథ పరంగా ఆ పాత్రలకి సమంతా సెట్ అవుతూ ఉండడంతో యాదృచ్చికంగా అలా జరిగి ఉంటుందేమో. కానీ ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంతాల మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగిందని మొన్న అఆ సక్సెస్ మీటులో త్రివిక్రమ్ మాటలని విన్న వారెవరైనా గమనించవచ్చు. బుర్రతో కాకుండా మనసు పెట్టి హృదయంతో సంభాషణలు రాయమని తనలోని కొత్త రచయితను సమంతా తట్టి లేపిందని త్రివిక్రమ్ అంటుంటే ఆమె తెలివితేటల పట్ల అందరికీ ముచ్చటేసింది. అంటే త్రివిక్రమ్ రచనా శైలిని ఈ ముద్దుగుమ్మ ఎంతలా పసిగట్టిందో ఆలోచించండి. అందుకే త్రివిక్రమ్ గారికి సమంతాలో ఓ అద్భుతమైన స్నేహితుడు కనపడుతుంటే, సమంతాకి మాత్రం త్రివిక్రమ్ గారిలో ఓ హితుడు కనిపించి ఉంటాడు. ఎందుకంటే, ఎన్నడు లేనిది అఆ రిలీజ్ సమయానికి సమంతా, నాగచైతన్యల వివాహ పరమైన గాసిప్ లాంటి వార్త, మీడియాలో హెడ్ లైన్స్ పైకి దూసుకురావడమే అలాంటి అపోహకి కారణం. నిజంగానే వీరి మధ్య చాన్నాళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తుందని, ఇంకా ఆలస్యం చేస్తే సినిమా పరిశ్రమలో ప్రేమలు ప్రేమలుగానే తప్ప పెళ్లిల్లుగా మారిన తార్కాణాలు తక్కువ కాబట్టి సమంతాను తొందరపడమని త్రివిక్రమ్ సలహా ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇదే నిజమయి, సమంతా-చైతు గనక వివాహ బంధంలో ఒకటయితే పెళ్లి పెద్దగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటారనడంలో సందేహమే లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ