Advertisementt

ఏంటి బ్రదర్, ఇలా కూడా చిచ్చు పెట్టొచ్చా?

Tue 14th Jun 2016 06:31 PM
junior ntr,cinemaa award,temper  ఏంటి బ్రదర్, ఇలా కూడా చిచ్చు పెట్టొచ్చా?
ఏంటి బ్రదర్, ఇలా కూడా చిచ్చు పెట్టొచ్చా?
Advertisement
Ads by CJ

నందమూరి, మెగా అభిమానుల మధ్య సఖ్యత మాట అటుంచి చిరంజీవి, బాలకృష్ణలు రాజ్యమేలిన 1980, 90 దశకాల నుండి వీరి మధ్య ఒక రకమైన పోటీతత్వం నెలకొంది. బయట అభిమానుల్లో ఈ తేడాలున్నా తెర వెనక బాలయ్య, చిరు మంచి స్నేహితులు. ఆ స్నేహం తదుపరి తరానికి అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ లాంటి వారికి కూడా ఓ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించింది. తేడా ఒకటే. ఏళ్ళ తరబడి సమయం గడిచినా, కొంత మంది అభిమానులు మాత్రం ఆ వైరాన్ని పోషిస్తూ, పెంచుకుంటూ ఉండిపోయారు. నిన్న జరిగిన సినిమా అవార్డ్స్ వేడుకలో చిరంజీవి, నాగార్జునల చేతుల మీదుగా టెంపర్ చిత్రానికి గాను జూనియర్ ఎన్టీయార్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడం హైలైట్. అవార్డ్ స్వీకరించిన తదుపరి, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ బాబాయి లాంటి హీరోలు ఈ తరం నటులకు  ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది చెప్పండి. సోషల్ మీడియాలో మాత్రం కొంత మంది బాబాయి బాలకృష్ణ పేరుని ఆఖర్లో చెప్పి, చిరంజీవి పేరుని మొదట చెప్పడం ఏంటని ఎన్టీయార్ ప్రసంగానికి కొత్త అర్థాలు వెతికేందుకు ప్రయత్నించారు. ఈ తతంగాన్ని మొత్తం గమనించిన నెటిజెన్స్ అయ్య బాబోయ్ ఇలా కూడా చిచ్చు పెట్టొచ్చా అని నవ్వుకున్నారు. అవార్డ్ ఆనందంలో ఉన్న తారక్ ఫ్యాన్స్... పోనీలే అని ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ