Advertisementt

మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

Tue 14th Jun 2016 04:03 PM
jr ntr,allu arjun,cinemaa awards,allu arjun praises jr ntr,temper,gona gannareddy  మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
మెగా, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

మా టీవీ ఏటా నిర్వహించే సినీ 'మా' అవార్డ్స్ ఫంక్షన్ హైదరాబాద్ నోవాటేల్ జరిగింది. ఈ ఫంక్షన్ లో సినీతారలు తమ డాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇందులో చిరంజీవి కూడా స్టేజి మీద డాన్సు చేసి ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఇక అవార్డుల కేటగిరిలో  జూనియర్ ఎన్టీఆర్ కి 'టెంపర్' చిత్రానికి ఉత్తమ నటుడు పురస్కారం లభించగా, 'రుద్రమదేవి' చిత్రానికి అనుష్క కు ఉత్తమ నటి అవార్డు లభించింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ అవార్డును చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. ఇంకా 'రుద్రమదేవి' చిత్రంలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ స్పెషల్ జ్యూరి అవార్డును అందుకున్నాడు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఈ వేదికను పంచుకోవడమే కాకుండా వీరిద్దరూ ఒకరినొకరు తెగ పొగిడేసుకున్నారు. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడతాడని, ఈ జెనరేషన్ లో హీరోల్లో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడని ఆసక్తికరంగా మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ బన్నీ తనకు మంచి మిత్రుడని, డాన్స్ బాగా చేస్తాడని ప్రశంసించాడు. ఇలా మెగా, నందమూరి హీరోలు ఒకరి గురించి మరొకరు మాట్లాడుతుంటే...చూసే వారు మాత్రం భలే ఎంజాయ్ చేశారు తెలుసా!.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ