ఒక సినిమాను 50కోట్లతో తీసి 60కోట్లు సంపాదిస్తే అది పెద్ద విజయం కిందకురాదనే చెప్పాలి. అదే కోటి రూపాయలతో సినిమాను తెరకెక్కించి 10కోట్లు సంపాదిస్తే అది నిర్మాతలకు, బయ్యర్లకు అందరికీ నిజమైన విజయం అని చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన విజయాన్ని తమిళంలో 'పిచైకారన్'గా రూపొంది తెలుగులో 'బిచ్చగాడు'గా రిలీజ్ అయిన చిత్రం సాధించిందని ట్రేడ్ వర్గాలు లెక్కలతో సహా చెబుతున్నాయి. ఇలాంటి లాభాలను తెచ్చే చిత్రాలు అరుదుగానే వస్తుంటాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్‌ఆంటోని హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను చదలవాడ శ్రీనివాసరావు 40లక్షలకు తీసుకున్నాడట. కాగా ఇప్పటివరకు ఈ చిత్రం అన్ని ఏరియాల్లో 7కోట్లు వసూలు చేసిందని సమాచారం. లాంగ్‌రన్ పూర్తయ్యే సరికి మరో కోటిరూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్స్‌తో నడుస్తుండటం విశేషం. మొత్తానికి జాక్‌పాట్ అంటే ఇదే అని చెప్పాలి.