'ఉడత పంజాబ్' చిత్రం లో పంజాబ్ ను చెడుగా చూపించారని ఆ సినిమా విడుదల ఆపాలని అకాలీదళ్ కార్యకర్తలు నిరసనల నేపధ్యం లో 'ఉడత పంజాబ్' నిర్మాతలు సినిమా విడుదలకు బోంబే హైకోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పై కోర్టు తన తీర్పును వెల్లడించింది. 'ఉడత పంజాబ్' చిత్రం విడుదలకు బొంబాయి హైకోర్ట్ అనుమతినిచ్చింది. ఒకే ఒక్క సెన్సార్ కట్ తో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. అంతే కాకుండా సినిమా విడుదలకు, ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. గతంలో 'ఉడత పంజాబ్' చిత్రానికి సెన్సార్ వారు 89 కట్ లు విధించిన సంగతి తెలిసిందే. అయితే బోంబే హైకోర్ట్.. సెన్సార్ బోర్డు తీరును తప్పుబట్టింది. ఇక ఈ సినిమాకు అన్ని అడ్డంకులు తొలిగిపోయి విడుదలకు సిద్ధమైనట్లే.