Advertisementt

మా అవార్డ్స్ లో 'టెంపర్' జోరు!

Mon 13th Jun 2016 06:26 PM
temper,jr ntr,maa awards,jr ntr got maa award,chiranjeevi,balakrishna  మా అవార్డ్స్ లో 'టెంపర్' జోరు!
మా అవార్డ్స్ లో 'టెంపర్' జోరు!
Advertisement
Ads by CJ

మా టీవీ 2016 అవార్డ్స్ హైదరాబాద్ లోని నోవాటేల్ లో ఘనంగా జరిగాయి. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. ఈసారి మా అవార్డ్స్ లో ఎన్టీఆర్ కి  బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇక 'రుద్రమదేవి' లో నటనకు అనుష్క బెస్ట్ యాక్ట్రీస్ అవార్డు అందుకుంది. 'టెంపర్' సినిమాలో మంచి నటన కనబరిచినందుకు  గాను ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేతులమీదుగా ఎన్టీఆర్ అందుకున్నారు. ఈ అవార్డు ని అందుకున్న ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకు మా తాత గారు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి వారు ఆదర్శమని చెప్పాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 3 మా అవార్డ్స్ అందుకున్నాడు. అందులో ఒకటి సింహాద్రి సినిమాకు గాను, మరొకటి యమదొంగ సినిమాకు అవార్డు లు అందుకున్నాడు. అంతే కాకుండా 'టెంపర్' ని  మరో 2 అవార్డులు కూడా వరించాయి. అందులో ఒకటి మాటల రచయిత పూరికి, మరొకటి కానిస్టేబుల్ గా నటించిన పోసాని కృష్ణమురళికి వచ్చాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ