Advertisementt

అమెరికా నిర్మాతకి తెలుగులో గుండు కొట్టించారు!

Mon 13th Jun 2016 05:51 PM
telugu film industry,producers  అమెరికా నిర్మాతకి తెలుగులో గుండు కొట్టించారు!
అమెరికా నిర్మాతకి తెలుగులో గుండు కొట్టించారు!
Advertisement
Ads by CJ

రంగుల ప్రపంచం అంటే అన్నీ ఇంపుగా ఉండే రంగులే కాదు, కంపు కొట్టే నిజాలు కూడా ఉంటాయి. బేసిక్ నాలెడ్జీ లేకుండా ఇక్కడి పైపై మెరుగులని చూసి, అబ్బా... ఇక్కడ కొడితే ఎక్కడికో వెళ్లిపోవచ్చు అన్న అత్యాశతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హిడెన్ నిర్మాతలుగా దిగిన ఓ అమెరికా భార్యాభర్తలకు ఇక్కడి మాయగాళ్ళు చుక్కలు చూపించి గుండి కొట్టి పంపించారు. మనం చెప్పుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాతగా వేరే సార్ పేరు టైటిల్ కార్డ్సులో పడినా పెట్టిన పెట్టుబడిలో 80 శాతం పైగా పాపం ఈ అమెరికాలో స్థిరపడ్డ భార్యాభార్తలదే అంట. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, దర్శకుడు ఒక్కడే కాదు ఇందులో హీరో దగ్గరి నుండి కెమెరామ్యాన్ వరకు ఎవరికి దొరికింది వారు దోచుకున్నారట. నిర్మాణ సమయంలో అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి పనులను పర్యవేక్షించిన ఈ NRI జంట స్థిరాస్తులను కూడా తాకట్టు పెట్టి సినిమాకు కావాల్సిన కాసులు సర్దారంటే పాపం అనిపించకమానదు. షూటింగ్ సాగతీత పూర్తయ్యి రిలీజుకి సిద్ధమయాక కానీ వీరికి అసలు విషయం తెలీలేదు. ఈ హీరో, హీరోయిన్ కాంబినేషన్ మీద వాళ్ళు పెట్టిన బడ్జెట్టుకి, పంపిణీదారులు ఇచ్చిన ఆఫరుకి కనీసం 4 నుండి 5 రెట్లు దూరం చూసి పోయాం మోసం అని నెత్తి పట్టుకున్నారు. పేరుకే నిర్మాతగా ఉన్న ఆ నిర్మాతను పట్టుకుని అసలు అమెరికా నిర్మాతలు నిలదీస్తే నాకేం సంబంధం అని తుర్రుమన్నాడు. గత్యంతరం లేని పరిస్థుతుల్లో సొంతంగా రిలీజ్ చేసుకొని కాలిన చేతులనే మళ్ళీ నిప్పులో పెట్టి కొత్త మంటను అనుభవించారు. ఈ మధ్య కాలంలో విడుదలయిన చిత్రాల్లో ఇంత నాసిరకం సినిమా రాలేదని విశ్లేషకులు తూర్పారబట్టారు. చేసేది ఏమీ లేక, విడుదలకు తీసుకున్న థియేటర్లకు అద్దెలు కట్టే డబ్బుల కోసం వీరు నానా కష్టాలు పడుతున్నారు. విశేషం ఏమిటంటే, సినిమా తీస్తున్నప్పుడు బెల్లం చుట్టూరా ఈగల్లాగా ముసిరినా జనాలు ఒక్కరు కూడా తోడు లేరు. ఇప్పుడు వీరిది ఒంటరి పోరాటం, మోసపోయి ఓడిపోయిన పోరాటం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ