రాజమౌళి జమ, ఖర్చు లెక్కలేసి నిర్మాతలు, బయ్యర్లు సరిగ్గా లాభాలు పొందేలానే సినిమాలు తీస్తాడన్నది మనందరం బాగా నమ్మే నిజం. ప్రభాస్, రానాల మీద బాహుబలి తీస్తున్నప్పుడు కూడా వంద కోట్ల పై చీలుకు బడ్జెట్ అంటే వ్యాపార వర్గాలు మొదట ఖంగుతిన్నాయి. ఒక్కసారి రిలీజ్ డేట్ దగ్గరయ్యాక, సినిమా ప్రచారాన్ని, విడుదల వ్యూహాన్ని గుర్తించి అవాక్కవడమే కాకుండా 500 కోట్ల పైగా గ్రాస్ ఫిగరు చూసి యావత్ ప్రపంచమే బ్లాంక్ ఫేస్ పెట్టింది. సో, జక్కన్నకి చెక్కడమే కాదు చెక్కిన శిల్పాన్ని ఎంతకు అమ్మితే లాభం వస్తుంది అన్న విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి బాహుబలి 2 మీద ప్రస్తుతం నెలకొన్న అంచనాలను, ఇటు వ్యాపారం పరంగాను అటు జనాల పరంగాను సరిగ్గా తూకమేసి మరీ ఈ చిత్ర బడ్జెట్ రూపొందించాడట. కేవలం బాహుబలి 2 క్లైమాక్స్ కోసమే హాలివుడ్ టెక్నిషియన్లను హైర్ చేసి 30 కోట్ల దాకా ఖర్చు పెట్టిస్తున్నాడంటే నిర్మాతలకు ఈయన మీదున్న నమ్మకం ఎంత పాటిదో తెలిసిపోతుంది. ఇక బాహుబలి 2 బడ్జెట్ విషయాలను రాజమౌళికే వదిలేసి, ఇది ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అన్న ప్రాథమిక అంచనాకు రావడానికి ట్రేడ్ విశ్లేషకులు ప్రయత్నిస్తే బాగుంటుంది.