Advertisementt

నిజం తెలుసుకున్న చైతూ....!

Mon 13th Jun 2016 12:10 PM
naga chaitanya,samantha,naga chaithanya samantha combination,4th time,manam,auto nagar surya,ye maaya chesave  నిజం తెలుసుకున్న చైతూ....!
నిజం తెలుసుకున్న చైతూ....!
Advertisement
Ads by CJ

గత కొద్ది రోజులుగా సమంత,నాగచైతన్య నిజజీవితంలో లవ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇటీవల ఒంటరిగా 'అ..ఆ' చిత్రం చూసినట్లు కూడా ఫొటోలు లీకయ్యాయి. అవి వాస్తవమా? కాదా? అనే విషయాన్ని పక్కనపెడితే ఈ ఇద్దరూ ఆ విషయంలో కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. నాగచైతన్య-సమంతలు కలిసి ఇప్పటివరకు మూడు చిత్రాల్లో నటించారు. 'ఏమాయ చేసావే, ఆటోనగర్‌ సూర్య, మనం' చిత్రాల్లో వీరు కలిసి నటించారు. కొద్ది కాలం కిందట వీరిద్దరి కాంబినేషన్‌లో 'అ..ఆ' చిత్రం చేయాలని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భావించాడట. కానీ ఇప్పటికే తమపై రూమర్లు ప్రచారంలో ఉన్నాయని, ఈ సమయంలో తాము మరలా కలిసి నటిస్తే ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని భావించిన చైతన్య ఆ చిత్రాన్నే వదులుకొని పెద్ద తప్పు చేశాడు. ఇప్పటికి ఆయన తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ వేర్వేరు అనే విషయాన్ని గ్రహించాడు. త్వరలో 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతూ సరసన సమంత అయితేనే పర్‌ఫెక్ట్‌గా స్టోరీకీ సూట్‌ అవుతుందని భావించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఆయన్ను సమంతతో కలిసి నటించేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. మొత్తానికి ఈ చిత్రం వారిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం కానుండటంతో సినిమాకు మరింత క్రేజ్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ