Advertisementt

'కబాలి' వెనుక మెగా ప్రొడ్యూసర్‌....!

Sun 12th Jun 2016 09:29 PM
kabali movie,telugu rights,shanmukha pictures,allu aravind,robo,binami  'కబాలి' వెనుక మెగా ప్రొడ్యూసర్‌....!
'కబాలి' వెనుక మెగా ప్రొడ్యూసర్‌....!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ అల్లు అరవింద్‌కు ట్రేడ్‌లో ఉన్న పట్టు ఇంకెవ్వరికి లేదంటే వాస్తవమే. ఏ సినిమాకైనా ఆయనకు కొన్ని లెక్కలు, ట్రేడ్‌ అంచనాలు ఉంటాయి. అవి ఎప్పుడు ఫెయిలైన దాఖలాలు లేవు. తన ట్రేడ్‌ పట్టుతో మెగా సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించిన తీరు అద్భుతం అని ఆయనంటే పడని వారు కూడా ఒప్పుకుంటారు. ఆయన కేవలం తానే నిర్మాతగా కాదు.. తనకు నమ్మదగిన సినిమా ప్రాజెక్ట్‌ ఉన్నప్పుడు అందులో డైరెక్ట్‌గానో ఇన్‌డైరెక్ట్‌గానో ఆయన తెరవెనుక ఉండి కూడా పెట్టుబడులు పెడుతుంటారు. 'రోబో' టైమ్‌లో ఆ చిత్రానికి విపరీతమైన ప్రీ రిలీజ్‌ టాక్‌ వచ్చింది. ఆ చిత్రం కోసం ఎందరో నిర్మాతలు పోటీపడినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొక్కజొన్నల వ్యాపారి ఆ చిత్రాన్ని భారీ రేటుకు కొన్నారు. దీని వెనుక కూడా అల్లుఅరవింద్‌ ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు రజనీ నటిస్తున్న తాజాచిత్రం 'కబాలి' విషయంలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని భారీ రేటుకు కొనడానికి పలువురు నిర్మాతలు పోటీపడ్డారు. కానీ చివరకు ఈ చిత్రం హక్కులు ఓ అనామక సంస్ద అయిన షణ్ముఖ పిక్చర్స్‌ చేతికి వెళ్లాయి. ఈ సంస్థ అధినేతలు ప్రవీణ్‌కుమార్‌. చౌదరిలు ఈ చిత్రం హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేశారు. పెద్దగా అనుభవం లేని వారు ఇంత పెద్ద మొత్తాలను వెచ్చించి హక్కులను కొనుగోలు చేయడానికి సిద్దపడరు. కానీ ఈ నిర్మాతలకు కూడా అల్లుఅరవింద్‌ బినిమీ అని, అందుకే ఆ నిర్మాతలు అంత పెద్ద మొత్తానికి తెగించారని అంటున్నారు. అయినా ఇండస్ట్రీలో ఇవ్వన్నీ కామన్‌ అని ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ