Advertisementt

అవార్డుల పై దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు!!

Sun 12th Jun 2016 05:17 PM
dasari narayana rao,jamuna,awards comments,padmasri,kaikala sathyanarayana  అవార్డుల పై దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు!!
అవార్డుల పై దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు!!
Advertisement
Ads by CJ

మా ఆర్టిస్ట్ అసోసియేషన్ సీనియర్ నటులను ఘనంగా సత్కరించింది. ఈ సత్కారనానికి మా సభ్యులతో పాటు దాసరి నారాయణ రావు, మంచు విష్ణు, మంచి మనోజ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జమున , కైకాల సత్యన్నారాయణ కు సన్మానం జరిగింది. ఈ సందర్భం గా దాసరి మాట్లాడుతూ జమున చాల పెద్ద నటి అని ఆవిడ ఎవ్వరికి తల వంచేది కాదని ఏది అనుకుంటే అది చేసేదని అందుకే ఆవిడ పేద హీరోలందరితో నటించిందని అన్నారు. అలంటి జమునకి సత్కారం జరగడం ఆనదంగా వుందని అన్నారు. అలాగే కైకాల సత్యన్నారాయణ కూడా  తాత మనవడు వంటి హిట్ సినిమాలలో నటించిన ఆయనను సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్న అన్నారు. ఇక ఆయన అవార్డుల గురుంచి సంచలన  వ్యాఖ్యలు చేసారు. జమున, అంజిలి దేవి, ఎస్ వి రంగారావు, సావిత్రి వంటి మహా నటులకి  పద్మశ్రీ వంటి అవార్డులు రాలేదంటే అది మన దౌర్భాగ్యం, దరిద్రం అని అన్నారు. ప్రభుత్వాలు టాలెంట్ ని గుర్తించకుండా రికమండేషన్ చేసిన వారికే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మ భూషణ్ వంటి అవార్డులు  ఇస్తుందని.... అది మన దౌర్భాగ్యం అని కూడా అన్నారు. అంతే కాకుండా ముక్కు ముఖం తెలియని వాళ్లకి... అవార్డులు ఇవ్వడం వలన ఆ అవార్డుల పరువు పోయిందని అన్నారు. అస్సలు వారు ఏమి సాధించారో,  వారికి ఆ గౌరవం ఎందుకు ఇచ్చారో కూడా తెలియని పరిస్తితుల్లో ఉన్నామని అవార్డుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

అవార్డుల పై దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు... video 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ