Advertisementt

నిత్య మీనన్, తప్పు లేదు... తప్ప లేదు

Sat 11th Jun 2016 03:28 PM
nithya menon,okka ammayi thappa   నిత్య మీనన్, తప్పు లేదు... తప్ప లేదు
నిత్య మీనన్, తప్పు లేదు... తప్ప లేదు
Advertisement
Ads by CJ

నిత్య మీనన్ హీరోయినుగా ఉందంటే ఆ సినిమా బంగారమే అనుకుంటారు నిర్మాతలు, బయ్యర్లు. ఎందుకంటే ఆ అమ్మాయిది అంత గోల్డెన్ లెగ్గు మరి. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ అనుభవించిన నితిన్ లాంటి హీరోల కెరీర్లు  కూడా గాడిలో పడేసిన ఘనత నిత్యాది. అటువంటి నిత్యా మీనన్ కథల సెలెక్షన్ పట్ల ఆమె అభిమానులు గుర్రుగా ఉన్నారు. మొన్నొచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి కానివ్వండి నిన్నొచ్చిన ఒక్క అమ్మాయి తప్ప కానివ్వండి, నిత్య అనవసరంగా ఈ పనికిరాని పాత్రలు ఒప్పుకుంటుంది ఏమో అన్న భావన ఎవరికైనా  కలుగుతోంది. ముఖ్యంగా ఒక్క అమ్మాయి తప్పలో హై టెక్ సిటీ ఫ్లై ఓవర్ మీద షేరింగ్ ఆటోలో కూర్చోవడం తప్ప నిత్య పెద్దగా వెలగబెట్టింది ఏమీ లేదు. విషయం కనుక్కుంటే తెలిసింది ఏమిటంటే, కెమెరా మెన్ చోట కే నాయుడు మీదున్న గౌరవం అనే ఆబ్లిగేషన్ తప్పించుకోలేకనే ఈ చిత్రం ఒప్పుకుందట. పారితోషికం విషయంలోనే కాక సినిమాలోని సీన్లలో కూడా తన ప్రాముఖ్యత తగ్గిననందుకే నిత్య ఈ చిత్ర ప్రమోషన్లకు రాలేదని వినికిడి. అంటే తప్ప లేదు కనకనే తప్పు చేసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ