స్టార్ హీరోలకు ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే... వారు నటించిన ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినంత మాత్రాన వారి మార్కెట్ సడన్‌గా పడిపోదు. ఒక సినిమా హిట్టయితే చాలు మరలా తమ తమ స్దానాలకు చేరుకుంటారు. 'బ్రహ్మోత్సవం' ప్రేక్షకులను, అభిమానులను, నిర్మాతను, బయ్యర్లను తీవ్రంగా నిరాశ పరచడంతో మహేష్ తదుపరి చిత్రమైన మురుగదాస్ చిత్రంపై ఆ ప్రభావం పడుతుందని పలువురు భావించారు. ఈ చిత్రానికి పెద్దగా బడ్జెట్ పెట్టే అవకాశం లేదని, అలాగే మహేష్ రెమ్యూనరేషన్‌లో కూడా కోత తప్పదనే ప్రచారం మొదలైంది. కానీ అవ్వన్నీ ఉత్త రూమర్స్ అని తేలిపోయింది. ఇటీవలే మురుగదాస్ వివిధ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన హెడ్స్‌తో ముంబైలో మీటింగ్ ఏర్పాటు చేశాడని సమాచారం. కాగా ఈ చిత్రానికి 85 నుండి 90కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో మహేష్ రెమ్యూనరేషన్ 23 కోట్లు అని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని కూడా 'తుపాకి'కి మించిన టైట్ స్క్రిప్ట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించనున్నారు. హీరోయిన్‌గా పరిణితి చోప్రా నటించనుంది.