బిజెపిలోకి అనూహ్య స్దాయిలో దూసుకువచ్చి ఏకంగా ప్రధానమంత్రి పీఠం దక్కించుకున్న హీరో నరేంద్రమోడీ. పూర్వాశ్రమంలో మోడీ అద్వానీకి అనుంగుశిష్యుడు. అద్వానీ ప్రాపకంలోనే ఎదిగిన మోడీ మొత్తానికి వృధ్దనాయకుడు అద్వానీ చేపట్టాల్సిన ప్రధాని పీఠాన్ని ఎగరేసుకొని వెళ్లాడు. పోనీ పదవి కాకపోయినా పార్టీలో గౌరవనీయమైన స్ధానమైనా ఇచ్చాడా? అంటే అదీ లేదు. గత కొంతకాలంలో అద్వానీ అసలు ఏమి చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? మోడీ రెండేళ్ల పాలన పట్ల ఆయన అభిప్రాయాలు ఏమిటి? అనేది కూడా తెలియడం లేదు. పోనీ ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవికి అద్వానీని మోడీ తెరపైకి తెస్తాడా? ఆయనకు ఆ గౌరవం అయినా దక్కేలా చేస్తాడా? లేక తన అనుచరగణంతో ఆయన అద్వానీకి ఆ విషయంలో కూడా అడ్డుపడుతాడా? అనేది ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ప్రధాని కాలేకపోయిన అద్వానీకి ఎలాగైనా రాష్ట్రపతి పదవి అయినా ఇవ్వడానికి ఆర్‌ఎస్‌ఎస్ సుముఖంగానే ఉంది. కానీ మద్యలో మహిళా అభ్యర్థి అంటూ సుమిత్రామహాజన్ పేరును, లేక అణుశాస్త్రవేత్త అయిన అబ్దుల్‌కలాంకు రాష్ట్రపతి పదవి ఇచ్చినట్లుగా, ఇన్పోసిస్ మాజీ చీఫ్ నారాయణమూర్తి వంటివారిని అద్వానీపైకి పోటీకి తేవాలనేది మోడీ వ్యూహంగా తెలుస్తోంది.