టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరైనా ఠక్కున దేవిశ్రీప్రసాద్ పేరునే చెబుతారు. ఆయన ప్రస్తుతం బాలయ్య వందో చిత్రం, చిరంజీవి 150వ చిత్రం, ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్', త్వరలో ప్రారంభం కానున్న రామ్‌చరణ్-సుకుమార్‌ల 'ఫార్ములా ఎక్స్' వంటి చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగాఉన్నాడు. అయితే దేవి త్వరలో నేచురల్ స్టార్ నాని చిత్రానికి అదిరిపోయే ఆల్బమ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో దిల్‌రాజు నిర్మాతగా 'సినిమా చూపిస్తమావా' డైరెక్టర్ త్రినాధరావు దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి దేవిశ్రీ అంగీకారం తెలిపాడని సమాచారం. మరి నానికి దేవిశ్రీ ఎలాంటి ఆల్బమ్ అందిస్తాడో వేచిచూడాల్సివుంది...!