Advertisementt

కాంగ్రెస్‌ అంటేనే అసహ్యించుకునేలా చేస్తున్నారు!

Fri 10th Jun 2016 08:15 PM
congress,palvai govardhan reddy,shabbir ali,jana reddy,telangana  కాంగ్రెస్‌ అంటేనే అసహ్యించుకునేలా చేస్తున్నారు!
కాంగ్రెస్‌ అంటేనే అసహ్యించుకునేలా చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే వార్తలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో విబేధాలు ముదిరిపాకనపడ్డాయి. సీఎల్పీ నేత జానారెడ్డిని కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కోవర్టు అని అభివర్ణించాడు. దీనితో షబ్బీర్‌అలీ మండిపడ్డాడు. క్రమశిక్షణ లేని వారు పార్టీ నుండి వెళ్లిపోయినా నష్టం లేదని వ్యాఖ్యానించాడు. సీనియరు నాయకులు కదా! అని గౌరవం ఇస్తుంటే పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని షబ్బీర్‌ వ్యాఖ్యానించాడు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అయినా తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి నాయకులే కారణమని ఆయన దుయ్యబట్టారు. తానే నిజమైన కాంగ్రెస్‌ నాయకుడిని అని, తనే అతి పెద్ద ప్రతిపక్షనేతనని, తనను మించిన ప్రతిపక్షనేత మర్వెవరూ లేరని వ్యాఖ్యానిస్తూనే మరోసారి పాల్వాయి.. జానారెడ్డిని కోవర్టు అని ఘాటుగా విమర్శించాడు. మొత్తానికి టి.కాంగ్రెస్‌ పరిస్ధితి చూస్తే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది. ఈ జగడం ఇక్కడితో ఆగకుండా పార్టీని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ