Advertisementt

చరణ్‌ ముందే వస్తున్నాడా....?

Fri 10th Jun 2016 01:58 PM
ram charan,allu aravind,dhruva,dasara,october,holidays  చరణ్‌ ముందే వస్తున్నాడా....?
చరణ్‌ ముందే వస్తున్నాడా....?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ గీతాఆర్ట్స్‌ బేనర్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్‌' రీమేక్‌ 'ధృవ' చిత్రంలో నటిస్తున్నాడు. పలు పనుల ఒత్తిడి కారణంగా రామ్‌చరణ్‌ ఈ చిత్రం షూటింగ్‌లో లేటుగా జాయిన్‌ అయ్యాడు. దీంతో ఆగష్టుకు రావాలనుకున్న ఈ చిత్రం దసరాకి షిఫ్ట్‌ అయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ రెండో వారంలో విడుదల చేస్తామని ఈ మద్య యూనిట్‌ నుండి వార్తలు వచ్చాయి. కానీ దసరా అంటే అక్టోబర్‌ 11న వస్తుంది. కాబట్టి రెండో వారంలో వస్తే దసరా సెలవులను పెద్దగా క్యాష్‌ చేసుకోలేమని నిర్మాత అల్లుఅరవింద్‌ భావిస్తున్నారు. దాంతో ఆయన ఈ చిత్రం రిలీజ్‌ను ప్రీపోన్‌ చేశారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తద్వారా దసరా సెలవులను పూర్తిగా క్యాష్‌ చేసుకునే అవకాశం ఉంటుందని అల్లుఅరవింద్‌ భావిస్తున్నాడు. అంతేకాక చరణ్‌కు అక్టోబర్‌ నెల పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో ఈ చిత్రాన్ని సెంటిమెంట్‌ పరంగా కూడా సెప్టెంబర్‌ 30 అయితేనే కరెక్ట్‌ అని యూనిట్‌ భావిస్తోంది. సో.. సెప్టెంబర్‌ 30కి విడుదలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషాల్లో హడావుడి పడకుండా ముందునుండే జాగ్రత్తగా షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసుకునే పనిలో ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ