Advertisementt

తెలుగులో అఆలు దిద్దుకుంది!

Fri 10th Jun 2016 12:08 PM
anupama parameshwaran,a aa  తెలుగులో అఆలు దిద్దుకుంది!
తెలుగులో అఆలు దిద్దుకుంది!
Advertisement
Ads by CJ

మళయాళ ముద్దుగుమ్మలు తెలుగులో భలే రాణిస్తున్నారు. ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ కూడా నిత్య మీనన్, సమంతాలా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోదామనుకునే ఉంటుంది. అందుకే రవితేజతో అప్పట్లో ఓ భారీ చిత్రాన్ని ఓకే చేసింది. ఆ సినిమాయే గనక సెట్స్ మీదకి వెళ్లుంటే అనుపమకు నిజంగా అదృష్టం తగులుకునేదే. బట్ దురదృష్టం వెంటాడడంతో అఆలో అఆలు దిద్దుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి గొప్ప దర్శకుడితో పని చేసానన్న ఆనందం, అదీ సూపర్ హిట్ మూవీతో తెలుగులో ఆరంగేట్రం అయిందన్న గొప్ప తప్పితే అనుపమకు ఈ సినిమాతో ఊడపొడిసేది ఏమీ లేదు. ఎందుకంటే క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్, సమంతాలు కొట్టుకుపోయారు. అందుకే ఎటువంటి మొహమాటం లేకుండా,  తెలుగులో ఇప్పుడిప్పుడే మొదటి పాఠం నేర్చుకున్నానని మీడియాతో బాధను పంచుకుంది. పోనీలే ఒకప్పటి సెకండ్ హీరోయిన్లో రాబోయే రోజుల్లు ఫస్ట్ హీరోయిన్లు అవుతారన్న నమ్మకం ఉంటె చాలు. మిగతా పాఠాలు మొత్తం పరిశ్రమ దానంతట అదే నేర్పిస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ