ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో, పలు కేసులు ఎదుర్కొంటున్న నిర్మాత సి.కళ్యాణ్, ఓ టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ... పవన్ పొలిటికల్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఆయనకు సినిమా పరిశ్రమ నుండి ఎలాంటి మద్దతు ఉండదన్నాడు. నటునిగా, సినిమాలకు సంబంధించి ఆయన ఏమైనా మద్దతు కోరితే అందిస్తామే కానీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మద్దతు ఇవ్వమంటే సినిమా పరిశ్రమ నుండి ఆయనకు ఎలాంటి మద్దతు ఉండదన్నారు. ఇంతకీ సి.కళ్యాణ్ ఏ హోదాలో ఆ కామెంట్స్ చేశారు? అసలు ఆయనను పవన్ ఏమైనా మద్దతు కోరాడా? ఇలాంటి వారి మద్దతు కోరాల్సిన అవవసరం పవన్‌కు ఏముంది? అంటూ ఆయనపై పవన్ అనుకూల వర్గం తీవ్ర విమర్శలను సంధిస్తున్నారు. పనిలో పనిగా ఈ మహా నిర్మాత పవన్ జనసేన పార్టీ స్ధాపించి తనకు టిక్కెట్ ఇస్తానన్నా కూడా తాను పోటీ చేయనని సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఇలాంటి విశ్వసనీయత లేని వ్యక్తులు పవన్ వంటి వారి పేరు వాడుకొని వార్తల్లో నిలబడాలనుకోవడం దురదృష్టకరమని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.