రేష్మి.. అలా పిలుస్తుంటే తట్టుకోగలరా..!

Fri 10th Jun 2016 08:52 AM
reshmi gautham,antham,antham trailer,reshmi exposing,jabardasth  రేష్మి.. అలా పిలుస్తుంటే తట్టుకోగలరా..!
రేష్మి.. అలా పిలుస్తుంటే తట్టుకోగలరా..!

అనసూయ పుణ్యమా అని 'జబర్దస్త్' యాంకర్ గా ఛాన్స్ కొట్టేసిన రేష్మి.. ఆ ప్రోగ్రాం తో వచ్చిన పేరుతో యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా పలు అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. యాంకర్ గా జబర్దస్త్ లో పొట్టి పొట్టి డ్రెస్ లు వేసి యువతను ఉర్రూతలుగిస్తున్న రేష్మి.. ఈ మధ్య సినిమాల్లో కూడా అదే హాట్ ని కంటిన్యూ చేస్తుంది. కురచ దుస్తులలో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇటీవల వచ్చిన 'గుంటూరు టాకీస్' లో రేష్మి రెచ్చిపోయిన  తీరు మరవక ముందే...అదే ఊపులో ఇప్పుడు 'అంతం' సినిమాలో కూడా తన అందాలతో విందు చెయ్యడానికి రెడీ గా వుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించి వచ్చిన ట్రైలర్ లో రేష్మి నిజంగానే స్వర్గం చూపించేస్తోంది. ట్రైలర్ చివరిలో ఆమె పిలిచిన తీరు విన్న వారెవరైనా సరే.. ఆమె మత్తు లోకి దిగాల్సిందే. కావాలంటే క్రింది లింక్ ఓపెన్ చేసి  రేష్మి అందాల పవరేంటో చూడండి. 

Click Here to see the Antham Trailer