మొత్తానికి సమంత మాయలో పడిపోయిన త్రివిక్రమ్ తాను సహజంగా సినిమాలను మెదడుతో ఆలోచించి తీస్తానని, కానీ 'సన్నాఫ్ సత్యమూర్తి' షూటింగ్ సమయంలో సమంత తనతో హృదయంతో స్పందించి సినిమా తీయమని చెప్పిందంటూ.. ఆమె స్ఫూర్తితోనే తాను 'అ...ఆ' చిత్రం తీశానని తెలిపాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలాకాలం కావడం, అసలే కరువుతో అల్లాడిపోతున్న ప్రేక్షకులకు 'అ..ఆ' చిత్రం ఎడారిలో ఒయాసిస్‌లా కనిపించడంతో కలెక్షన్లు దుమ్మురేపుతోంది. ఈ చిత్రం మొత్తంగా 100కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా తీస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ వద్ద రెండు కథలు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ రెండు కథలను ఆయన పవన్‌కు చెప్పాడట. పవన్ మాత్రం ఈ రెండు కథలను ముందు రామ్‌చరణ్‌కు వినిపించు. అందులో అతనికి నచ్చిన కథను అతను సెలక్ట్ చేసుకుంటే ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తానని చెప్పాడట. ఇక మిగిలిన రెండో కథను తానే చేస్తానని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్, రామ్‌చరణ్‌ల చిత్రాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే రామ్‌చరణ్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్' రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సివుంది. మరి ఆయన త్రివిక్రమ్‌తో చేయబోయే చిత్రం ఎప్పుడు? ఈ విధంగా చూస్తే చాలా ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోపక్క దిల్‌రాజు నిర్మాతగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నాడు. మరి ఆ చిత్రంలో హీరో ఎవరనేది? కూడా ఆసక్తికరంగా మారింది. ఇటు పవన్, అటు చరణ్ మధ్యలో దిల్ రాజు అంటూ.. ప్రేక్షకులను, ఇండస్ట్రీ ని త్రివిక్రమ్ బాగానే కన్ఫ్యూజ్ చేస్తున్నాడుగా..!