మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై అల్లుఅరవింద్ నిర్మాతగా తమిళ 'తని ఒరువన్' చిత్రం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ధృవ' అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ చిత్రాన్ని మొదట్లో ఆగష్టులో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ చాలా కారణాల వల్ల ఈ చిత్రాన్ని దసరా బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ తన 150వ చిత్రంగా వినాయక్ దర్శకత్వంలో తమిళ 'కత్తి' రీమేక్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం కనుక సంక్రాంతికి విడుదలైతే బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' నుండి పోటీ తప్పదు. తాజాగా అబ్బాయ్ రామ్‌చరణ్‌కు గానీ లేదా అన్నయ్య చిరంజీవికి కానీ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నుండి పోటీ తప్పని పరిస్దితి ఏర్పడుతోంది. తమ చిత్రాన్ని రెండు పండగలైన దసరా లేదా సంక్రాంతిలో ఏదో ఒక పండుగ సందర్బంగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రకటించాడు. ఈచిత్రాన్ని మూడు నెలలో పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. దసరాకి ఈ చిత్రం ముహూర్తం చూసుకుంటే అది అబ్బాయ్ రామ్‌చరణ్ 'ధృవ' కు, సంక్రాంతికి అనుకుంటే అది అన్నయ్య మెగాస్టార్ చిత్రంకు పవన్ నుండి పోటీ తప్పదని తెలుస్తోంది.