దాసరి చేసే వ్యాఖ్యలు ఒక్కొసారి ఒక్కో విధంగా ఉంటాయి. తనకు అనుకూలంగా తనకు నచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తుంటాడాయన. గతంలో చాలా సార్లు మైక్ దొరికినప్పుడల్లా స్టార్ హీరోలు, స్టార్‌హీరోయిన్లు తమ చిత్రాల ప్రమోషన్‌కు రాకుండా నిర్మాత, దర్శకులను నానా తిప్పలు పెడుతున్నారని, కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పుడు వారికి ప్రమోషన్‌లో పాల్గొనాల్సిన నైతిక బాధ్యత ఉందంటూ.. పెద్ద చిత్రాలకు కూడా పబ్లిసిటీ, ప్రమోషన్లు చాలా అవసరమని ఆయన తేల్చిచెప్పాడు. తాజాగా ఓ చిన్న చిత్రం వేడుకలో పాల్గొన్న ఆయన పెద్ద స్టార్స్ చిత్రాలకు ప్రమోషన్ అవసరం లేదని, అయినా నానావిధాలుగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నారని, అందువల్లే స్టార్స్ చిత్రాలు ఈమధ్య ఎక్కువగా బోల్తాకొడుతున్నాయని ఆయన సూత్రీకరించాడు. ఆహా.. దాసరి గారా..! మజాకా..! తనకు నచ్చిన స్టేట్‌మెంట్‌ను తానే చెప్పగలరు? దానికి వ్యతిరేక స్టేట్‌మెంట్‌ను కూడా ఆయనే ఇవ్వగలరు. ఇదే దాసరిగారి పబ్లిసిటీ యావ. మరి ఆయన పవన్‌తో తీయబోయే చిత్రం స్టార్ చిత్రమే కాబట్టి... ఆయన ఆ చిత్రాన్ని ఆసలు ప్రమోషన్ లేకుండానే విడుదల చేస్తాడేమో చూద్దాం!