ఉడత పంజాబ్ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఈ సినిమాలో పంజాబ్ స్టేట్ ని చెడుగా చూపించడం పై అకాలీదళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ లో పంజాబ్ పేరు తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ కూడా దీనిలో 89 సీన్లు తొలిగించాలని నిర్ణయించింది. అయితే ఈ సినిమాకి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరియు సినిమా ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి ఒక్క సీన్ కూడా తొలిగించక్కర్లేదని అభిప్రాయ వ్యక్తం చేసారట. అయినా సినిమాని సినిమాలా చూడాలని.. దీనికి రాజకీయ రంగు పులమోద్దని కొందరు అంటున్నారు.