Advertisementt

ఎస్‌.జె.సూర్య కన్ఫర్మ్ చేశాడుగా!

Wed 08th Jun 2016 04:02 PM
sj suriya,villain,mahesh babu and muragadoss movie,sj suriya director and actor  ఎస్‌.జె.సూర్య కన్ఫర్మ్ చేశాడుగా!
ఎస్‌.జె.సూర్య కన్ఫర్మ్ చేశాడుగా!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు, ఎన్వీప్రసాద్‌లు నిర్మాతలుగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్‌.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. 'ఖుషీ, నాని, పులి' వంటి చిత్రాలతో దర్శకునిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఎస్‌.జె.సూర్య పలు తమిళచిత్రాల్లో నటించి నటునిగా కూడా తనకంటూ ఓ సపరేట్‌ స్టైల్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'ఇరవై' చిత్రం గత శుక్రవారం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియావారు మహేష్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీలో మీరు విలన్‌గా నటిస్తున్నారట కదా...! అని ప్రశ్నించగా అవునని చెప్పిన సూర్య ఈ విషయం మురుగదాస్‌, మహేష్‌లు అఫీషియల్‌గా ప్రకటిస్తేనే గౌరవంగా ఉంటుందని సమాధానం ఇచ్చాడు. సో.. సూర్య నటిస్తున్నాడు అనే వార్తలు ఇప్పుడు నిజమేనని తేలాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ