Advertisementt

అక్కడ 'జనతాగ్యారేజ్‌'కి అదిరిపోయే ఆఫర్‌...!

Wed 08th Jun 2016 03:33 PM
janatha garage,jr ntr,janatha garage karnataka rights,7 crores,koratala siva,samantha,nithya menon  అక్కడ 'జనతాగ్యారేజ్‌'కి అదిరిపోయే ఆఫర్‌...!
అక్కడ 'జనతాగ్యారేజ్‌'కి అదిరిపోయే ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా 'మిర్చి, శ్రీమంతుడు' చిత్రాల తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్‌'. అయితే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విపరీతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈచిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా అదిరిపోయే స్దాయిలో జరుగుతోంది. ఇక తెలుగు స్టార్స్‌ చిత్రాలకు కర్ణాటకలో ఎంతటి క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.అయితే 'జనతాగ్యారేజ్‌' రైట్స్‌ కోసం అక్కడి బడా బడా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు ఈ చిత్రం రైట్స్‌కోసం క్యూకడుతున్నాయి. ఈ చిత్రం కర్ణాటక ప్రాంతం హక్కులను 7కోట్లకు ఓ సంస్ధ కొనుగోలు చేసిందని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు కాగా 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ