Advertisementt

టార్గెట్‌ 'బాహుబలి'...!

Wed 08th Jun 2016 01:54 PM
south india,bahubali,tamil market,mythological movie,250 crores,puli,director shankar  టార్గెట్‌ 'బాహుబలి'...!
టార్గెట్‌ 'బాహుబలి'...!
Advertisement
Ads by CJ

సౌతిండియాలో ఇప్పటివరకు 'బాహుబలి'ని కొట్టే సినిమా రాలేదు. మరో విధంగా చెప్పాలంటే 'బాహుబలి' స్ధాయి నిర్మాణ విలువలతో బాలీవుడ్‌లో కూడా ఇప్పటివరకు అలాంటి చిత్రం రాలేదు. అయితే తెలుగు కంటే మార్కెట్‌పరంగా పెద్దదైనా తమిళంలో త్వరలో 'బాహుబలి'ని మించిన స్దాయిలో ఓ మైథలాజికల్‌ మూవీని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 250కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కానుందని సమాచారం. సూర్య హీరోగా ఈ భారీ మైథలాజికల్‌ మూవీని సుందర్‌ సి. దర్శకత్వంలో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెండ్రాల్‌ ఫిలిమ్స్‌ సంస్ద తమ 100వ చిత్రంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో 'బాహుబలి'ని దృష్టిలో ఉంచుకొని విజయ్‌ హీరోగా చేసిన భారీ చిత్రం 'పులి' ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కానీ 'బాహుబలి'ని కొట్టే సినిమా అంటే అది తమిళంలో కేవలం శంకర్‌కు మాత్రమే సాధ్యమని, అంతేగానీ సుందర్‌.సి. వంటి దర్శకులు ఇలాంటి ప్రయోగాలు చేయడం చేతులు కాల్చుకోవడమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ