టాలీవుడ్ లో టాప్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ ల జాబితాలో చోటు సంపాదించుకున్న రకుల్ ఈ మధ్య అమెరికాలో జరిగిన ఒక ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా అమెరికా ఎయిర్ పోర్ట్ లో కాలికి గాయమైందని వార్తలు వచ్చాయి. ఫ్లైట్ ఎక్కడానికి టైం అయ్యిపోతుందని హడావిడిగా పరిగెత్తుతూ పడిపోయిందని దీనితో రకుల్ కాలికి గాయం అయ్యిందని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే కాలికి గాయం అవ్వడం వలన ఆమె ఈ నెల 30 న సింగపూరులో జరిగే సైమా అవార్డ్స్ కి హాజరవ్వడం కూడా కష్టమే అనే న్యూస్ కూడా బయటికి వచ్చింది. ఈ న్యూస్ చూసిన రకుల్ నాకు గాయం అవ్వడం నిజమే కాని నాకు కాలికి కాదు దెబ్బ తగిలింది.... మెడకి తగిలిందని నేను ఆ గాయం నుండి ఆల్ మోస్ట్ కోలుకున్నానని... అలాగే నేను రేపటినుండి నా వర్క్ లో బిజీ అవుతాను తన పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.