మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ధృవ' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటు మరో హీరో కనిపించనుండడం విశేషం. చరణ్ కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. రానా, శర్వానంద్, మంచు మనోజ్ వీరందరూ చరణ్ కు మంచి స్నేహితులు. వీరే కాదు చరణ్ కు మరో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. మరెవరో కాదు హీరో నవదీప్. చరణ్ ఏ పార్టీ కండక్ట్ చేసిన అందులో నవదీప్ ఉండాల్సిందే. రియల్ లైఫ్ లో స్నేహితులైన వీరిద్దరూ ఇప్పుడు తెరపై స్నేహితులుగా కనిపించనున్నారు. అసలు విషయంలోకి వస్తే 'తని ఒరువన్' చిత్రానికి రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ ఓ ట్రైనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. తనకో ముగ్గురు స్నేహితులు ఉంటారు. అందులో ఒకరిగా నవదీప్ కనిపించనున్నారు. గత చిత్రాలతో పోలిస్తే నవదీప్ ఈ పాత్రలో కొత్తగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చరణ్ మాత్రం ఈ షెడ్యూల్స్ లో పాల్గొనలేదు. పాత్రకు తగిన విధంగా తన శరీరాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు చెర్రీ. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.