ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతోన్న నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి నిర్మాతగా మారి తన సత్తాను చాటుకున్నాడు. ఎంతో తెలివిగా అనుకున్న బడ్జెట్ లో సినిమాలు చేయడమంటే దిల్ రాజుకే సాధ్యం. తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ నిర్మాత త్వరలోనే ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇంతకీ ఆ సెన్సేషన్ ఏంటి..? అనుకుంటున్నారా. ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఆర్ధిక సమస్యల కారణంగానో.. లేక రాజకీయాలకు వెళ్ళిన తరువాత సినిమాలకు దూరంగా ఉండాలనో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో నటించాడు. ఆ సినిమా రిజల్ట్ నిరాశ పరిచినా.. క్రుంగిపోకుండా ఎస్.జె.సూర్య తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాడు పవన్. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారనేది తెలియని విషయం. ఒకానొక సమయంలో నాకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుందని దిల్ రాజు చెప్పాడు. కాని ఆ సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా దిల్ రాజు, త్రివిక్రమ్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నామని.. అది కూడా ఓ స్టార్ హీరోతో ఉంటుందని వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నామని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తుంటే దిల్ రాజు తో సినిమా చేయబోయేది పవన్ కళ్యానే అనే వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్, పవన్ లాంటి క్రేజీ హీరో వీరందరీ కాంబినేషన్ లో సినిమా అంటే సేన్సేషనే కదా మరి..!