మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం తమిళ 'కత్తి' రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా అనుకున్న తర్వాత మొదట పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టాలని చిరు -వినాయక్‌లు భావించారు. కానీ ఇప్పుడు మరలా హీరోయిన్ విషయం మొదటికి వచ్చింది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ను మొదట యాక్షన్ సీన్స్‌తో ప్రారంభించి అంతలోపు హీరోయిన్‌ని ఖరారుచేయాలని చిరు-వినాయక్‌లు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి చూపు బాలీవుడ్ సుందరి దీపిక పదుకుణె పై పడిందని సమాచారం. కాని ఈవిషయం ఫైనల్ అవ్వాల్సి వుంది. అందుకే మొదటగా హీరోయిన్‌తో సంబంధం లేని సీన్స్‌ను తీసి, ఆతర్వాత హీరోయిన్‌తో కలిసి చేయాల్సిన సీన్స్‌ను తీయాలని భావిస్తున్నారు. ఈచిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈచిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం విషయంలో మెగా ఫ్యామిలీతో పాటు వినాయక్‌లు ఎంతో కేర్ తీసుకుంటున్నారు.