Advertisementt

మెగా హీరోకు హిట్టిస్తాడా...?

Mon 06th Jun 2016 03:59 PM
b.v.s ravi,sai dhram teja,mega hero,tikka movie,wanted movie,soljar movie  మెగా హీరోకు హిట్టిస్తాడా...?
మెగా హీరోకు హిట్టిస్తాడా...?
Advertisement
Ads by CJ

వరస సక్సెస్‌లో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ వరస చిత్రాలను ఒప్పుకొంటున్నాడు. ఇప్పటికే ఆయన సునీల్‌రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన గోపీచంద్‌ మలినేని, మారుతి చిత్రాలకు ఓకే చెప్పాడు. అయితే తాజాగా ఈ హీరో మరో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. మెగాఫ్యామిలీకి ఆప్తుడైన రచయిత కమ్‌ డైరెక్టర్‌ బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి సాయి ఓకే చెప్పాడు. ఈ చిత్ర కథను కూడా విన్న సాయి ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈచిత్రాన్ని దర్శకుడు హరీష్‌శంకర్‌ నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి 'సోల్జర్‌' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 'వాంటెడ్‌' చిత్రంతో దర్శకునిగా మారి, మొదటి సినిమాతోనే భారీ ఫ్లాప్‌ను అందుకున్న బి.వి.ఎస్‌ రవి మెగా మేనల్లుడుకు హిట్‌ ఇస్తాడో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ