త్వరలో పవన్‌కళ్యాణ్-ఎస్.జె.సూర్యల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా శృతిహాసన్‌ను అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమె తన తండ్రితో చేస్తున్న 'శభాష్‌నాయుడు' కోసం రెండు నెలల కాల్షీట్స్ ఇచ్చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో శృతిహాసన్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే కనుక నిజమైతే పవన్-రకుల్‌లు తొలిసారి ఆన్‌ది స్క్రీన్ రొమాన్స్ చేయనున్నారు. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయన్‌గా వెలుగొందుతోంది. ఆమె ఇప్పటికే పలువురు యంగ్‌స్టార్స్ సరసన నటించింది. ముఖ్యంగా మెగా హీరోలైన బన్నీ సరసన 'సరైనోడు'లో నటించగా, రామ్‌చరణ్ సరసన 'బ్రూస్‌లీ' చిత్రంతో పాటు తాజాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లుఅరవింద్ నిర్మాతగా గీతాఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న తమిళ 'తని ఒరువన్' రీమేక్ 'ధృవ'లో కూడా రెండోసారి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే త్వరలో ఆమె మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కూడా ఓ చిత్రం ఒప్పుకుంది. మరి పవన్ చిత్రంలో ఆమెకు అవకాశం వస్తే అది ఆమె అదృష్టమే అనిచెప్పవచ్చు.