Advertisementt

శ్రీనివాస్ రెడ్డికి ఈ దురద దేనికో?

Mon 06th Jun 2016 12:30 PM
srinivas reddy,a aa success meet speech  శ్రీనివాస్ రెడ్డికి ఈ దురద దేనికో?
శ్రీనివాస్ రెడ్డికి ఈ దురద దేనికో?
Advertisement

కనీస సభా మర్యాదలు కూడా తెలియని వారు ఆర్టిస్టులుగా పరిశ్రమలో కొనసాగుతున్నారని చెప్పుకోవడానికి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కన్నా అత్యంత హీనమైన ఉదాహరణ ఇంకోటి ఉండదేమో. అఆ సినిమాను వెబ్  మీడియా మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుండి జాలువారిన మరో అత్యున్నత చిత్రంగా పొగుడుతూనే మూలకథని, కథనాన్ని యుద్ధనపూడి సులోచనా రాణిగారి మీనా నవల అలాగే విజయనిర్మల గారి మీనా చిత్రం నుండి తీసుకున్నందున వారిరువురిలో ఎవరికో ఒకరికి థాంక్స్ కార్డ్ వేసుంటే బాగుండేదన్న ఆలోచనను వినమ్రంగానే వెలిబుచ్చాయి. మీడియా వారు వేసిన బాణం తగలాల్సిన త్రివిక్రమ్ గారికో లేక నిర్మాత చిన బాబు గారికో తగిలితే వారు సమాధానం చెప్పుకునేవారు. 

 

కానీ పానకంలో పుడక, కూరలో కరివేపాకు లాంటి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి కలిగిన అత్యుత్సాహం చూస్తుంటే ఇతగాడికి నోటి దూలతో పాటుగా ఉండరాని చోట గజ్జి, తామర కూడా ఉన్నాయనిపిస్తోంది. అందుకేనేమో అఆ సక్సెస్ మీటు కార్యక్రమంలో నోటికి అదుపే లేకుండా వెబ్ మీడియాను  ఆడిపోసుకున్నాడు. స్టేజి మీదెక్కి మాట్లాడినప్పుడు విషయ స్పష్టత ఉంటె మంచిది. అసందర్భోచిత, అశ్లీల వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సముచితం కాదు. వెబ్ సైట్ల వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకునేందుకు ఇతగాడు సినిమాలో చూపినట్టుగా బాల్ కొనుక్కోమని సలహా ఇచ్చాడు. మళ్ళీ ఏ బాల్ అయినా సరే, ---క్కోవచ్చు అంటూ అచ్చు కూడా వేయలేని పదాలను వాడుతూ నీచాతినీచంగా మాట్లాడడం బహుశా శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక్కడికే చెల్లుతుంది. 

 

వెబ్ సైట్ వాళ్ళకే స్ట్రెస్ ఉంటె మీ సినిమాకు మేటి రేటింగ్స్ వచ్చేవా? బహుశా మేము అక్కడే తప్పు చేసి ఉంటామేమో. సక్సెస్ వచ్చింది కదాని అవాకులు చెవాకులు పేలకుండా పాత్రికేయ మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞ్యతలు తెలిపిన త్రివిక్రమ్ కూడా శ్రీనివాస్ రెడ్డి బూతులకి నవ్వుతూ తలూపడం, వీరి విజయ గర్వం కాక మరేమిటి అనుకోవాలో. అటు పక్కనే ఉన్న సమంత కూడా పాపం తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడేసరికి అనుకుంటా, నవ్వు ఆపుకోలేకపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారూ... మీరు మాకు చెప్పిన బంతి ఫిలాసఫీ బాగానే ఉంది గానీ... మీరింతలా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారో, ఎక్కడ ఎవరి బంతులు జోకడానికో మాకు తెలియదా చెప్పండి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement