Advertisementt

ఇలా చూస్తే ఎవరు ఎవరికి గురువు...?

Sat 04th Jun 2016 11:14 PM
prabhu deva,lawrence,abhinetri,guruvu,prabhudeva follows lawrence  ఇలా చూస్తే ఎవరు ఎవరికి గురువు...?
ఇలా చూస్తే ఎవరు ఎవరికి గురువు...?
Advertisement
Ads by CJ

టాప్‌ కొరియోగ్రాఫర్‌గానే కాకుండా దర్శకునిగా, నటునిగా, డ్యాన్సర్‌గా వెలుగొందుతున్న ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవాకు లారెన్స్‌ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. కాగా దర్శకునిగా, హీరోగా లారెన్స్‌ కెరీర్‌ను మలుపుతిప్పి ఆయనకు వరుస హిట్స్‌ అందిస్తోంది 'ముని' సీక్వెల్‌ చిత్రాలు. ఈ చిత్రాలతో లారెన్స్‌కు లాభాల పంట పండుతోంది. వాస్తవానికి దక్షిణాదిన తిరిగి హర్రర్‌ కామెడీ జోనర్‌ చిత్రాలకు 'ముని'తో ఊపిరి పోసిన ఘనత లారెన్స్‌కు దక్కుతుంది. ఆయన తీసిన 'ముని, కాంచన, గంగ' వంటి చిత్రాలు బయ్యర్లనే కాదు.. నిర్మాతలను కూడా కోటీశ్వరులను చేశాయి. హీరోగా సక్సెస్‌ కావాలని భావిస్తున్న లారెన్స్‌ కోరికను తీరుస్తున్నాయి. కాగా హిందీలో వరుస దక్షిణాది చిత్రాల రీమేక్‌లతో దర్శకునిగా విశ్వరూపం చూపిస్తున్న ప్రభుదేవాకు ఇప్పుడు కాలం పెద్దగా కలిసి రావడం లేదు. దీంతో ప్రభుదేవా కూడా నిర్మాతగా మారి, తమన్నా, సోనూసూద్‌ ప్రధానపాత్రల్లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అభినేత్రి' లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌లో ప్రభుదేవా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి మరలా పాత ప్రభుదేవాను మన కళ్లముందుంచాడు. ఈ చిత్రం కూడా హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మొత్తానికి లారెన్స్‌కు గురువైన ప్రభుదేవా తన శిష్యుడిని ఫాలో అవుతూ 'అభినేత్రి' చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్నాడని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ