Advertisementt

అమీజాక్సన్‌ కి టైమొచ్చింది...!

Sat 04th Jun 2016 06:44 PM
amy jackson,amy jackson time stats,yevadu fame,i movie fame,shankar,robot 2,amy jackson got big chances  అమీజాక్సన్‌ కి టైమొచ్చింది...!
అమీజాక్సన్‌ కి టైమొచ్చింది...!
Advertisement
Ads by CJ

తమిళంలో 'మద్రాసపట్టణం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన బ్రిటిష్‌ బ్యూటీ అమీజాక్సన్‌. ఆమె తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'ఎవడు' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. కానీ ఆ తర్వాత శంకర్‌ చిత్రం 'ఐ'లో హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో ఆమెకు తెలుగులో పలు అవకాశాలు వచ్చాయి. కానీ దర్శకుడు శంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఆమె టాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం ఆమె మరలా శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ -అక్షయ్‌కుమార్‌లు కలిసి నటిస్తున్న 'రోబో2.0' చిత్రంలో నటిస్తోంది. కాగా ఇప్పుడు ఈ అమ్మడుకు మరిన్ని మంచి తెలుగు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' తర్వాత ప్రభాస్‌-సుజీత్‌-యువి క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్‌ను తీసుకున్నారని సమాచారం. గతంలో అమీజాక్సన్‌ తాను ప్రభాస్‌తో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని, ఆయన సరసన నటించాలనేది తన డ్రీమ్‌గా పేర్కొంది. ఇప్పుడు ఈ చిత్రంతో అమీ కల నెరవేరనుంది. ఇక అల్లుఅర్జున్‌ హీరోగా లింగుస్వామి డైరెక్షన్‌లో రూపొందనున్న ద్విభాషా చిత్రంలో కూడా అమీజాక్సన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం. మొత్తానికి ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే చిత్రాలలో అమీజాక్సన్‌కు పెద్ద పీట వేస్తున్నారని అర్ధమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ