Advertisementt

పాజిటివ్ రోల్ లో నటించా: కాలకేయ ప్రభాకర్

Sat 04th Jun 2016 06:30 PM
prabhakar interview,right right movie,sumanth ashwin  పాజిటివ్ రోల్ లో నటించా: కాలకేయ ప్రభాకర్
పాజిటివ్ రోల్ లో నటించా: కాలకేయ ప్రభాకర్
Advertisement

'మర్యాద రామన్న' సినిమాలో విలన్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు  ప్రభాకర్. ఆ తరువాత ఒక్కసారిగా 'బాహుబలి' సినిమాలో కాలకేయుడి పాత్రలో నటించి నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన 'రైట్ రైట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. నటుడు ప్రభాకర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

నటుడ్ని అవుతాననుకోలేదు..

ఓ పోలీస్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను. జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యాను కానీ నటుడ్ని అవ్వడానికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. 'మర్యాద రామన్న' సినిమాతో నాకు లైఫ్ ఇచ్చింది రాజమౌళి గారే. ఆ తరువాత 'బాహుబలి'తో నన్ను మరో మెట్టు ఎక్కించింది కూడా ఆయనే..

బాహుబలి తరువాత..

'బాహుబలి' సినిమా నుండి 'రైట్ రైట్' వరకు నా ప్రయాణం సంతోషంగానే జరిగింది. బాహుబలి సినిమా తరువాత నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్లు అయింది. అప్పటివరకు ఒక ఫైట్, ఒక సీన్ అన్నట్లు ఉండే నా లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నాకు కొత్త. నాకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లాను. కాని ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.

పాజిటివ్ రోల్ లో కనిపిస్తా..

'రైట్ రైట్' సినిమాలో నాది విలన్ రోల్ కాదు. ఓ పాజిటివ్ పాత్రలో కనిపిస్తాను. సెంటిమెంట్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ నా పాత్రలో ఉంటాయి. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. 

మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది..

ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. తను హీరో కంటే మంచి స్నేహితుడని చెప్పొచ్చు. అప్పటివరకు మాకు ముఖపరిచయం లేదు. షూటింగ్ లోనే కలిశాను. ప్రతి సీన్ చేసే ముందు ఇద్దరం డిస్కస్ చేసుకొని నటించేవాళ్ళం. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. 

ఒరిజినల్ సినిమా చూశా..

రైట్ రైట్ మలయాళం రీమేక్ సినిమా. నేను ఒరిజినల్ చూశాను. స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంకా బెటర్మెంట్ కోసమే ప్రయత్నించారు. 

ఎస్.కోట నుండి గవిటి వెళ్ళే బస్..

ఓ రిమోట్ విలేజ్ అయిన ప్రాంతంలో ఉండే బస్ కి నేను డ్రైవర్ ను. నా పాత్ర పేరు శేషు. శ్రీకాకుళం బాషలో మాట్లాడే వ్యక్తి. ప్రతిరోజు సాయంత్రం బయలుదేరిన బస్ తరువాత రోజు ఉదయాన్నే మళ్ళీ సిటీకి వచ్చేస్తుంది. విలేజ్ లో ఉండేవారంతా.. డ్రైవర్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. వైజాగ్ ప్రాంతంలో ఎస్.కోట నుండి గవిటికి మా బస్ ప్రయాణం చేస్తుంటుంది.  

టాలెంటెడ్ డైరెక్టర్..

ఈ చిత్ర దర్శకుడు మను ఇదివరకే చాలా సినిమాలకు పని చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్. ప్రతీ సీన్ మాతో ముందే డిస్కస్ చేసి సెట్స్ కి వెళ్ళేవారు. అలానే ఎంఎస్ రాజు గారు కూడా ఎంతో హెల్ప్ చేశారు. 

డాన్స్ చేశాను..

ఈ సినిమాలో కొత్తగా కనిపించాలని నా బాడీ లాంగ్వేజ్, లుక్ ఇలా ప్రతి విషయంలో కేర్ తీసుకున్నాను. ఈ సినిమాలో నాతో డాన్స్ కూడా చేయించారు.

కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..

గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అక్కడకి వేరే వేరే ప్రాంతాల నుండి జనాలు వచ్చారు. కెనడా, చైనా నుండి కూడా వచ్చారు. వారంతా నన్ను గుర్తుపెట్టుకొని బాహుబలి కాలకేయ గురించి మాట్లాడారు. ఆ సమయంలో నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాకు ఆ స్థాయి కల్పించిన రాజమౌళి గారికి రుణపడి ఉంటాను.

వినాయక్ గారు ఆఫర్ ఇచ్చారు..

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో వినాయక్ గారు నన్ను కలిసి మాట్లాడి, నీకొక మంచి పాజిటివ్ రోల్ ఆఫర్ చేస్తానని చెప్పారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఆక్సిజన్ సినిమాలో టిపికల్ విలన్ పాత్రలో నటిస్తున్నాను. అలానే 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి',కాలకేయ వర్సెస్ కాట్రవల్లి' మలయాళంలో మోహన్ లాల్ గారితో మరో సినిమాలో నటిస్తున్నాను. కన్నడలో మూడు సినిమాల్లో నటిస్తున్నాను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement