Advertisementt

మహేష్ రోల్.. రివీలయ్యింది..!

Sat 04th Jun 2016 06:28 PM
mahesh babu,intelligence officer,ar murugadoss,mahesh babu and muragadoss movie details  మహేష్ రోల్.. రివీలయ్యింది..!
మహేష్ రోల్.. రివీలయ్యింది..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మహేష్ చాలా అందంగా కనిపించాడు. నటన పరం గా మంచి మార్కులే కొట్టేసాడు. అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ కి దర్శకుడు ఏమాత్రం కారణం కాదని మహేష్ చెప్పాడు. ఇక మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురుంచి ఆలోచిస్తున్నాడు. తన తరవాతి ప్రాజెక్ట్ మురుగదాస్ దర్శకత్వంలో ఉంటుందని మహేష్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఆ సినిమా కి సంభందించిన పనులు చక చక జరిగిపోతున్నాయని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మురుగదాస్ ఇప్పటికే పూర్తిచేసినట్లు తెలుస్తుంది. ఇంటిలిజెన్సు ఆఫీసర్ గా మహేష్ ఈ మూవీ లో కనిపించనున్నాడు. హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఎంపిక చేసారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సెట్స్ ని అన్నపూర్ణ స్టూడియో లో వేయనున్నారట. ఈ మూవీకి సంబంధించి అన్ని పనులు మురుగదాస్ పర్యవేక్షణలో జరుగుతున్నాయట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయని.. సినిమాని వచ్చేనెలలో ప్రారంభిస్తారని సమాచారం. ఠాగూర్ మధు, ఎంవి ప్రసాద్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ్ లో రూపుదిద్దుకోనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ