Advertisementt

స్టార్‌ హీరోలకు హీరోయిన్లు కావాలి!

Sat 04th Jun 2016 04:50 PM
star heroes,heroines shortage,chiranjeevi,pawan kalyan,balakrishna,mahesh babu,rakul preet singh  స్టార్‌ హీరోలకు హీరోయిన్లు కావాలి!
స్టార్‌ హీరోలకు హీరోయిన్లు కావాలి!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. పవన్‌కళ్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి శృతిహాసన్‌, కీర్తి సురేష్‌లతో పాటు పలు పేర్లు పరిశీలిస్తున్నారు. అదే తరహాలో త్వరలో తెలుగు, తమిళ భాషల్లో మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రం హీరోయిన్‌ విషయంలో కూడా ఉత్కంఠ నడుస్తోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం అనుష్క లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలపై దృష్టి పెట్టింది. ఇక కాజల్‌, సమంత, తమన్నా వంటి హీరోయిన్లు బాగా పాతపడిపోయారు. ఇప్పుటికే మన యంగ్‌స్టార్స్‌ వారితో రెండు మూడు సార్లు జత కట్టేసి ఉన్నారు. మరోసారి వారితోనే జోడీ కడితే ఇబ్బందిగా ఫీలవుతూ, ప్రేక్షకులు కూడా మొనాటనీగా ఫీలయ్యే అవకాశం ఉందని హీరోలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రమే కొందరు స్టార్స్‌కు అందుబాటులో ఉంది. ఇక ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయన కూడా 'జనతాగ్యారేజ్‌'లో మరోసారి సమంతతో జోడీ కడుతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాత్రం ఫ్రెష్‌ హీరోయిన్‌ను తీసుకోవాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు ఇక వీరితో పాటు సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ తదితరులకు కూడా హీరోయిన్ల ఎంపిక క్లిష్టతరంగా మారుతోంది. సో.. ఇక పరాభాషా హీరోయిన్ల వైపు దృష్టి పెట్టకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ